Tamil Nadu: షాకింగ్ వీడియో, వేగంగా వెళుతున్న లారీ నుంచి బైకర్ మెడకు చుట్టుకున్న తాడు, అమాంతం ఎగిరి రోడ్డు మీద పడిన బైకర్, తృటిలో తప్పిన ప్రాణాపాయం

దీంతో బైక్‌పై నుంచి బైకర్ అమాంతం కింద పడ్డాడు. అయితే ఈ ఘటనలో అతనికి ఎలాంటి సీరియస్ గాయాలు కాకపోవడం ఆశ్చర్యంగా చెప్పవచ్చు.

Rope from truck wraps biker's neck in freak road accident (Photo-Video Grab)

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎరువులు తీసుకెళ్తున్న ట్రక్కు నుంచి తాడు వేలాడటంతో అది వెనక వస్తున్న బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో బైక్‌పై నుంచి బైకర్ అమాంతం కింద పడ్డాడు. అయితే ఈ ఘటనలో అతనికి ఎలాంటి సీరియస్ గాయాలు కాకపోవడం ఆశ్చర్యంగా చెప్పవచ్చు. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన బైకర్ ముత్తు తన పని ప్రదేశం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏరల్‌ ప్రాంతం దాటుతుండగా ఒక్కసారిగా బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముత్తుకు స్వల్ప గాయాలయ్యాయి.సమీపంలోని దుకాణంలోని సిసిటివి ఫుటేజ్‌లో ట్రక్కుపై కట్టిన తాడు జీను తెగిపడి బైక్‌పై నుండి విసిరిన ముత్తు మెడకు చిక్కుకుందనట్లుగా చూపిస్తున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)