Tamil Nadu Shocker: షాకింగ్ వీడియో, అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, సీసీ టీవీ పుటేజీ వైరల్
రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఈ దారుణాన్ని చూస్తున్నారే గానీ, ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం.
తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.రద్దీ రహదారిపై ఓ వ్యక్తి తన భార్యను పలుమార్లు కత్తితో దారుణంగా పొడవడంతో..ఆమె అక్కడే కుప్పకూలి మృతి చెందింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఈ దారుణాన్ని చూస్తున్నారే గానీ, ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)