Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్, అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీఛార్జ్
ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు వచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో మరికొద్ది నిమిషాల్లో పడనున్నాయి. ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి 9.30 గంటలకు అంటే మరికొద్ది నిమిషాల్లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు వచ్చారు.
తాజాగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద లాఠీ ఛార్జ్ జరిగింది. ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో ఆ థియేటర్‌కు రావడంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. ఏం చేయాలో తెలియక జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Allu Arjun arrives at Sandhya theatre in Hyderabad