Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే, తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు, విధించిన రూ.30లక్షల జరిమానా నెలలోపు చెల్లించాలని స్పష్టం

పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

Telangana High Court (photo-File Image)

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (TS High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని.. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆయనకు రూ.30లక్షల జరిమానా విధించింది. నెలలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. దీనిలో రూ.25లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు, రూ.5లక్షలు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్‌ గతంలో చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు

Telangana HC imposes hefty fine on former BRS MLA

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)