World’s Richest Person: ఎలాన్ మస్క్ మళ్లీ కిందకు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్, 28వ స్థానంలో గౌతం అదానీ
మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే రెండవ స్థానానికి వచ్చేశారు.ఈ విషయాన్ని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానాన్ని కోల్పోయాడు. మొదటి స్థానంలో చేరిన కేవలం 48 గంటల్లోనే రెండవ స్థానానికి వచ్చేశారు.ఈ విషయాన్ని బ్లూమ్‍బర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రస్తుతం వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా లూయిస్ విటన్ సంస్థ సీఈవో 'బెర్నార్డ్ అర్నాల్ట్' చేరాడు. ప్రస్తుతం అర్నాల్ట్ సంపద 187 బిలియన్ డాలర్లు కాగా ఎలాన్ మస్క్ సంపద 176 మిలియన్లుగా ఉంది.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారత్ కు చెందిన ముఖేష్ అంబానీ 79.9 బిలియన్ డాలర్ల సంపాదనతో 11 స్థానంలో, గౌతమ్ అదానీ 44.7 బిలియన్ డాలర్ల సంపాదనతో 28వ స్థానంలో నిలిచారు.ఇటీవల ప్రపంచ కుబేరుల జాబితాలో 187.1 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ మొదటి స్థానాన్ని పొందిన సంగతి విదితమే.
Here's Update