Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ
రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు
ఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు. ఈ క్రమంలో బాధితుడి కార్డుపై ఉన్న రహస్య నెంబర్లను గుర్తించిన దుండగుడు.. తన ఏటీఎంను యంత్రంలో ఉంచి మీరే చూసుకోండి అంటూ.. బాధితుడి కార్డు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంత సేపటికీ తన కార్డు పని చేయకపోవడంతో విషయాన్ని బంధువులకు చెప్పారు.అయితే ఈ లోపే బాధితుడు కార్డు నుండి దొంగ రూ. 75 వేలు నగదు డ్రా చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏటీఎం కార్డు మార్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘటన (వీడియో)
Theft Caught on Camera:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)