Tirupati Laddu Dispute: హిందూ దేవుళ్ల మీద నమ్మకం లేని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలా ? చురకలు అంటించిన వైసీపీ నేత పోతిన మహేష్

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్‌ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

Pothina Mahesh and Pawan Kalyan (photo-FB)

బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి. అంతేగానీ విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పోతిన వెంకట మహేష్‌ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ పాయింట్‌ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూలో కల్తీ జరగలేదని స్వయంగా మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆయన ప్రకటించారు.

వీడియో ఇదిగో, తిరుపతి లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే నీ బూట్లు తుడుస్తా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

ఇక.. అసలు పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు ఆయనకు సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ల మీద మీకు నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు. గొడ్డు మాంసం తినొచ్చని ఒకసారి పవనే అంటారు. అలాంటిది సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి?. పవన్‌ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని.. రాజకీయ దీక్ష అని ఎద్దేవా చేశారు. టీటీడీ దేవాలయాలకు వెళ్లలేని పవన్‌..సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని మహేష్‌ అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now