Goods Trains Collided: మధ్యప్రదేశ్‌లో రైలు ప్రమాదం, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న గూడ్స్ ట్రైన్లు, ఇంజిన్లలో చెలరేగిన మంటలు
మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో (Shahdol) రెండు రైళ్లు ఢీకొన్నాయి. సింగాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి (collision). దీంతో రెండు రైళ్ల ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ట్రైన్లలోని డ్రైవర్లు గాయపడ్డారు. మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మంటల్లో (goods trains collided) చిక్కుకున్నారు.
Shahdol, April 19: మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో (Shahdol) రెండు రైళ్లు ఢీకొన్నాయి. సింగాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి (collision). దీంతో రెండు రైళ్ల ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ట్రైన్లలోని డ్రైవర్లు గాయపడ్డారు. మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మంటల్లో (goods trains collided) చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి రెండు ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. దీంతో లోపల చిక్కుకున్నవారిని తీసుకువచ్చేందుకు రెస్క్యూటీం శ్రమిస్తున్నారు. ప్రమాదం కారణంగా బిలాస్‌పూర్- కత్నీ రూట్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)