Udhayanidhi Stalin: మాపై హిందీని రుద్దటాన్ని ఆపండి, హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు.
హిందీ దివస్ (హిందీ భాషా దినోత్సవం) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. భారతదేశంలోని వైవిధ్యాన్ని హిందీ ఏకం చేస్తుందని, హిందీ ఏ భాషతోనూ పోటీపడదని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలను ఏకం చేసే మార్గం హిందీ భాష అని పేర్కొన్నారు.దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఓ నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేస్తుందా? అని ప్రశ్నించారు.
హిందీపై అమిత్ షా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని, హిందీ మాత్రమే గొప్ప భాష అనే ఆలోచనను బీజేపీ విడనాడాలని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు. హిందీ వల్లే అభివృద్ధి సాధ్యం అనేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.సనాతన ధర్మం ఓ మహమ్మారి వంటిదని, దాన్ని నిర్మూలించకపోతే చాలా ప్రమాదమని ఉదయనిధి వ్యాఖ్యానించిన సంగతి విదితమే.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)