Ujani Dam Tragedy: పూణెలో ఘోర విషాదం, ఉజాని డ్యామ్‌లో పడవ బోల్తా, అయిదుగురు మృతి, మరొకరు గల్లంతు

పూణె జిల్లాలోని కలాషి గ్రామ సమీపంలోని ఉజాని డ్యామ్ వద్ద ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు పూణే రూరల్ పోలీసు అధికారులు తెలిపారు. మిగిలిన వ్యక్తి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Ujani Dam Tragedy: Five Bodies Recovered As Boat Capsizes in Pune Dam, Search Operation Underway (See Pics)

మహారాష్ట్రలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూణె జిల్లాలోని కలాషి గ్రామ సమీపంలోని ఉజాని డ్యామ్ వద్ద ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు పూణే రూరల్ పోలీసు అధికారులు తెలిపారు. మిగిలిన వ్యక్తి కోసం సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. నగరానికి 140 కిలోమీటర్ల దూరంలో పూణే జిల్లా కలాషి గ్రామ సమీపంలోని ఉజాని డ్యామ్ నీటిలో పడవ బోల్తా పడటంతో ఆరుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఇదిగో, మద్యం మత్తులో స్నేహితులు రెచ్చగొట్టడంతో ఈత రాకపోయినా నదిలో దూకిన యువకుడు, మునిగిపోతుంటే ఇంకా రెచ్చగొడుతూ..

పూణె జిల్లాలోని ఇందాపూర్ తహసీల్‌కు సమీపంలోని కలాషి గ్రామ సమీపంలోని ఉజని డ్యామ్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. "నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), స్థానిక పరిపాలన మరియు పోలీసుల బృందాలు శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం మోహరించబడ్డాయి" అని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)