UK PM Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం
లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ఈ సమావేశాల్లోనే ప్రకటన చేయనున్నారు.
అనంతరం ఢిల్లీకి పయణమవుతారు. బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందిన వారే కావడంతో ఆయన నేరుగా అహ్మదాబాద్ వచ్చారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా బోరిస్ జాన్సన్ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)