Hathras Stampede: హత్రాస్‌లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట, 27 మంది మృతి, వందమందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
రతీభాన్‌పూర్‌లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని హత్రాస్ (Hathras)లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. రతీభాన్‌పూర్‌లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. Etah CMO ఉమేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ, "ఇప్పటి వరకు 27 మృతదేహాలు పోస్ట్‌మార్టం హౌస్‌కు చేరుకున్నాయి, ఇందులో 25 మంది మహిళలు మరియు 2 పురుషులు ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు కూడా. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)