Boat Capsizes in River Ganga: గంగానదిలో ఘోర ప్రమాదం, పడవ బోల్తా పడి నలుగురు మృతి, మరో 25 మంది గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
యూపీ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
యూపీ (Uttar Pradesh)లోని బల్లియా జిల్లా (Ballia district)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్ గంగా ఘాట్ (Maldepur Ganga Ghat) సమీపంలో గంగా నది (River Ganga)లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోయిన కొందరిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 25 మంది వరకు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికుల్ని ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)