Uttar Pradesh: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిన కారు, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం దాటికి కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులోని నుంచి వెలికితీసి ఆస్పత్రికు తరలించారు. మృతులంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)