63 Inmates Test HIV Positive: యూపీ జైల్లో 63 మంది ఖైదీలకు ఎయిడ్స్, ఎలా వచ్చిందో తెలియక తలలు పట్టుకుంటున్న జైలు అధికారులు

గత ఏడాది డిసెంబర్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు (63 Inmates Test HIV Positive) చేరింది. వైరస్‌ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత కొరవడింది

Jail (Representational Image/ Photo Credits: IANS)

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ(AIDS) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు (63 Inmates Test HIV Positive) చేరింది. వైరస్‌ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత కొరవడింది.

వీరిలో చాలామందికి డ్రగ్స్‌ తీసుకునే అలవాటుందని, వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిని మరొకరు వాడటం వల్లే ఈ వైరస్‌ వ్యాపించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.జైలుకు (Lucknow Jail) రాకముందే హెచ్‌ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని అంటున్నారు.హెచ్‌ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. లక్నో జైలులో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్‌, మొత్తం 47కు చేరిన హెచ్‌ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య, అప్రమత్తమైన జైలు అధికారులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)