Uttar Pradesh Assembly Elections 2022: కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్, 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్, మార్చి 10న ఫలితాలు

భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. చందౌలీ, ఘాజీపూర్, మౌ, అజంగఢ్, మీర్జాపూర్, భదోహి, జౌన్‌పూర్, సోన్‌భద్ర, వారణాసి జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

Punjab Elections Voting. (Photo Credits: ANI)

ఉత్తర ప్రదేశ్‌ ఏడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. చందౌలీ, ఘాజీపూర్, మౌ, అజంగఢ్, మీర్జాపూర్, భదోహి, జౌన్‌పూర్, సోన్‌భద్ర, వారణాసి జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 54 సీట్లలో మొత్తం 613 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.‘‘చివరి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పాల్గొని కొత్త ఓటింగ్ రికార్డు సృష్టించాలని ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాను.’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. ఉదయం 9 గంటల వరకు 8.58 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

చివరి దశ పోలింగ్ సందర్భంగా 60,000 మంది పోలీసులు, 845 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలోని 6,662మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, 53,424 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 19 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లను పోలింగ్ కేంద్రాల వద్ద నియమించారు.మార్చి 10వతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.