Uttar Pradesh: ప్రేమించి మోసం చేసిందని పెళ్ళి కూతురును తుఫాకీతో కాల్చి చంపిన మాజీ ప్రియుడు, బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటుండగా..
మధ్యప్రదేశ్‌లోని దతియాకు చెందిన 22 ఏళ్ల కాజల్ అహిర్వార్‌కు ఒక వ్యక్తితో ఆదివారం రాత్రి పెళ్లి జరుగనున్నది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోపెళ్ళి కోసం బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటున్న పెళ్లికూతురును ఆమె మాజీ ప్రియుడు కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని దతియాకు చెందిన 22 ఏళ్ల కాజల్ అహిర్వార్‌కు ఒక వ్యక్తితో ఆదివారం రాత్రి పెళ్లి జరుగనున్నది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు నలుగురు అమ్మాయిలతో కలిసి మేకప్ కోసం ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. వీడియో ఇదిగో, హోటల్ గదిలో జంట ఆత్మహత్య, ప్రియుడు ఉరి వేసుకోగా, ప్రియురాలు విషం తాగి సూసైడ్
దతియాకు చెందిన మాజీ ప్రియుడు దీపక్ ఒక బ్యాగ్ తగిలించికుని ముఖానికి ముసుగు వేసుకుని ఆ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు. ‘కాజల్ బయటకు రా. నన్ను ఎందుకు మోసం చేశావు?’ అని గట్టిగా అరిచాడు. తనతో రావాలని ఆమెను బలవంతం చేశాడు. కాజల్ నిరాకరించడంతో మేకప్ రూమ్ డోర్ పగులగొట్టాడు. బలవంతంగా లోనికి ప్రవేశించాడు. గన్‌తో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాజల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)