Lightning Strikes in UP: ఒక్కసారిగా పిడుగుల వర్షం, 14 మంది మృతి, మరో 16 మందికి గాయాలు, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన యూపీ సీఎం
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు
యూపీలోని పలు ప్రాంతాల‍్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బండా జిల్లాలో నలుగురు, ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్, చందౌలీ, బలుందర్‌శహర్, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)