Uttar Pradesh: హనుమాన్ వేషం వేసి స్టేజి మీదనే గుండె పోటుతో మృతి చెందిన ఆర్టిస్ట్, యూపీలో విషాద ఘటన

యూపీలో ఫతేపూర్ జిల్లాలో హనుమాన్‌ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్‌ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. సేలంపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్లకుపైగా వయసున్న రామ్ స్వరూప్, శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు.

Representational Image (Photo Credits: Twitter)

యూపీలో ఫతేపూర్ జిల్లాలో హనుమాన్‌ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్‌ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. సేలంపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్లకుపైగా వయసున్న రామ్ స్వరూప్, శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు. రామ్‌ లీలా నాటకాన్ని ప్రదర్శించాడు. లంకా దహనం ఘట్టం సందర్భంగా నిప్పంటించిన తోకతో ఒక బల్లపై డ్యాన్స్‌ చేశాడు. అయితే గిరాగిరా తిరిగిన అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డ్యాన్స్‌ చేస్తున్న బల్ల పైనుంచి కిందపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement