Uttar Pradesh: స్కూటీపై రోడ్డు మీద వెళుతున్న యువకుడు, గాలి పటం దారం చైనీస్ మాంజా తగలడంతో తెగిన గొంతు, కోర్టులో ఫిర్యాదు చేసిన యువకుడు
స్కూటీపై ప్రయాణిస్తున్నఓ యువకుడికి దారిలొ గాలి పటాలకు కట్టే దారం చైనీస్ మాంజాను అడ్డుగా రావడంతో గొంతుపై లోతైన కోత ఏర్పడింది. బాధితుడిని రాజ్ కరణ్‌గా గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యులు అతనిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ గాయానికి నాలుగు కుట్లు పడ్డాయి.
స్కూటీపై ప్రయాణిస్తున్నఓ యువకుడికి దారిలొ గాలి పటాలకు కట్టే దారం చైనీస్ మాంజాను అడ్డుగా రావడంతో గొంతుపై లోతైన కోత ఏర్పడింది. బాధితుడిని రాజ్ కరణ్‌గా గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యులు అతనిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ గాయానికి నాలుగు కుట్లు పడ్డాయి.ఈ ఘటనఅనంతరం ముఖ్యమంత్రి పోర్టల్‌లో ఫిర్యాదును అప్‌లోడ్ చేసి జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్ష్కర్‌కు లిఖితపూర్వకంగా ఆ యువకుడు ఫిర్యాదు చేశారు.
పిలిభిత్‌లోని సీనియర్ క్రిమినల్ లాయర్ అశ్విని అగ్నిహోత్రి మాట్లాడుతూ, జూలై 11, 2017న దేశవ్యాప్తంగా నైలాన్ లేదా సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేసిన గాలిపటాలు ఎగురవేసే అన్ని దారాలపై ఎన్‌జిటి నిషేధం విధించిందని తెలిపారు. గతంలో నవంబర్ 19, 2015న అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ రాష్ట్రంలో చైనీస్ మాంజాపై నిషేధం విధించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత 2017లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లు హెచ్‌సీ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు.
Here's ANI Tweet