Man Thrown off Running Train: దారుణం, కదులుతున్న రైల్లో నుంచి 40 ఏళ్ళ వ్యక్తిని కిందకు తోసేసిన మరో వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి చెందిన బాధితుడు

యూపీలో దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Representational Image | (Photo Credits: PTI)

యూపీలో దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్‌ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది.

పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్‌ కింద కదులుతున్న ట్రైయిన్‌ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి.దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్‌ ఫోన్‌ షాజహాన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement