Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 9 మంది మృతి

ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఓ పికప్ వ్యాన్ లోయలో పడింది. ఈ ఘటన లో 9 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలియజేసారు.

Uttarakhand Road Accident (Photo Credits: X/@ANINewsUP)

ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఓ పికప్ వ్యాన్ లోయలో పడింది. ఈ ఘటన లో 9 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలియజేసారు. ఉదయం 8 గంటలకు వాహనం పట్లోట్ నుండి అమ్జాద్ గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. అయితే ఈ సంఘటన ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను కాపాడే ప్రయత్నంలో వాహనం వాగులో పడిపోయింది. ఈ క్రమంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చనిపోయిన వారిలో దంపతులు, వారి కుమారుడు కూడా ఉన్నారని మీనా తెలియజేసింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now