Vande Bharat Fire: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, వీడియో ఇదిగో..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే రైలును నిలిపివేసి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Vande Bharat Express (Photo-PTI)

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే రైలును నిలిపివేసి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న రాణి కమలాపతి (భోపాల్)-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ANI VIdeo

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement