Karnataka: షాకింగ్ వీడియో, రోడ్డు మధ్యలో కారు డోర్ తెరవడంతో వెనక నుంచి వచ్చిన మహిళకు ఘోర ప్రమాదం, రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ

ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది.

Woman Rider Run Over After Being Hit By Door Of Parked Car (Photo-Video Grab)

కర్ణాటకలో షాకింగ్ వీడియోని కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ ట్వీట్ చేసింది.ఈ వీడియోలో ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తోంది. ముందు నిలిపి ఉంచిన కారు డోరును అకస్మత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది మహిళ. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపైకి ఎక్కింది. కారు డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదం గత సెప్టెంబర్‌ 24న జరిగింది. రోడ్డుపై వెళ్లేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ప్రమాదం వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది కర్ణాటక రోడ్డు భద్రతా సంస్థ.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)