
Hyderabad, Mar 3: హైదరాబాద్ (Hyderabad) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ఆ చిన్నారి ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్
హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో ఘటన
ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఢీకొట్టిన కారు
అక్కడికక్కడే ప్రాణాలను వదిలిన చిన్నారి
మరో ఇద్దరు చిన్నారులకు గాయాలు
కార్ డ్రైవర్ ను… pic.twitter.com/OjpwTN1xWL
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025
రాష్ డ్రైవింగ్ కారణంగానే
అయితే, కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ కారణంగానే అంకిత చనిపోయినట్టు గుర్తించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డుఅయిన ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)