Vijay Kashyap Dies: కరోనాతో కన్నుమూసిన యూపీ మంత్రి విజయ్ కశ్యప్, గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, యూపీలో కరోనాతో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు మృతి
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు కన్నుమూశాడు. ముజఫర్‌నగర్ జిల్లా చర్తవాల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ కశ్యప్ (56) ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రులు యూపీలో ముగ్గురయ్యారు. ఇటీవల విజయ్ కశ్యప్ కరోనా బారినపడగా అస్వస్థతకు గురవడంతో గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చేరారు.
అతడి ఆరోగ్యం మంగళవారం అర్ధరాత్రి విషమించి మృతి చెందాడు. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)