CAA: దేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై కేంద్ర మంత్రి సంచలన ప్రకటన, వచ్చే ఏడు రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసి తీరుతామని స్పష్టం
రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, దేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను గ్యారంటీ ఇస్తున్నా అని బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలోని కక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు.
CAA to be implemented across India in 7 days: రానున్న ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, దేశం అంతటా సీఏఏ అమలు చేస్తామని నేను గ్యారంటీ ఇస్తున్నా అని బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలోని కక్‌ద్వీప్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఠాకూర్ మాట్లాడారు.
పార్లమెంటు ఉభయ సభల్లో సీఏఏ బిల్లు 2019లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టంపై భారతదేశం అంతటా భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేశాయి. తాజాగా మంత్రి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సీఏఏను అమలు చేయకుండా దేశంలో ఎవరూ ఆపలేరని గతంలో అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి విదితమే.ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లక్ష‍్యంగా చేసుకుని అమిత్ షా ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Here's Video