PM Modi Performs Puja: కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించిన ప్రధాన మోదీ, చంబా మహిళలు చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రధారణలో ఆలయాన్ని విజిట్ చేసిన భారత ప్రధాని
ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్ చేరుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.
ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్ చేరుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ ఆలయాన్ని విజిట్ చేశారు.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. గౌరికుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇవాళ సాయంత్రం బ్రదీనాథ్ కూడా మోదీ వెళ్లనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)