Madhya Pradesh: వైరల్ వీడియో, అంబులెన్స్ రాకపోవడంతో జెసీబీపై గర్భిణిని ఆస్పత్రిని తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు, మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం
మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్ చేశారు. కానీ వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు.దీంతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు సదరు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు జేసీబీ మెషిన్‌ని ఏర్పాటు చేశారు. దీంతో అదికారులు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)