Madhya Pradesh: షాకింగ్ వీడియో, బైకర్‌ను వెంబండించి కత్తితో పొడిచి చంపిన ఆరుమంది మైనర్లు, సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మైనర్లు ఓ బైక్‌ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు.రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి

6 Minors Chase After Bike, Stab Man On Busy Road In Madhya Pradesh (Photo-Video Grab)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మైనర్లు ఓ బైక్‌ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు.రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్‌ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్‌ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు.

అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్‌ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now