CM Eknath Shinde: వైరల్ వీడియో.. షిండే అంకుల్.. మీలా సీఎం కావడం ఎలా? మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చిన చిన్నారి, నవ్వుతూ బదులిచ్చిన సీఎం ఏక్‌నాథ్
మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి.
షిండే అంకుల్.. ముఖ్యమంత్రి కావడం ఎలా అంటూ ఓ చిన్నారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన ప్రశ్న ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసింది అన్నడా దామ్రే అనే ఓ చిన్నారి. ‘మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. అంతేకాదు.. దీపావళి సెలవుల్లో తననూ గౌహతికి తీసుకెళ్లాలని సీఎం షిండేను అభ్యర్థించింది.
దానికి సీఎం షిండే నవ్వుతూ.. నువ్వు ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతావ్. అందుకోసం ఒక తీర్మానం కూడా పాస్ చేస్తాం అంటూ చెప్పారాయన. దీపావళికి గువాహతికి తీసుకెళ్తానని, అక్కడున్న కామాఖ్య గుడికి వెళ్దామా? అని అడిగారాయన. దానికి అలాగే అనే సమాధానం ఇచ్చింది. ఈ చిన్నారి చాలా హుషారు అని షిండే అనడంతో.. అక్కడున్నవాళ్లంతా నవ్వారు.