World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్ సఫారీలో గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..
నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు.
నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు.కాగా ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ (Gujarat)కు వెళ్లిన విషయం విదితమే.
ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి సిన్హ్ సదన్ నుంచి సఫారీకి బయల్దేరారు. జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో (Gir forest) సింహ సఫారీకి వెళ్లారు.
PM Narendra Modi takes lion safari in Gir forest in Gujarat
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)