CM Yogi Adityanath Covid: యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా, ఐసోలేషన్‌లోకి వెళ్లిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇంటి నుంచి అన్ని పనులు చేస్తానని తెలిపిన యూపీ సీఎం
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. నిన్ననే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లిన ఆయన.. ఇవ్వాళ తనకు కరోనా పాజిటివ్ (CM Yogi Adityanath Covid) వచ్చిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా తాలూకు లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నానని, అందులో పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు.
డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.మతన కార్యాలయ అధికారులకు కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన మంగళవారం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయన ఓఎస్డీ అభిషేక్ కౌషిక్ సహా కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ లోకి వెళ్లిన యోగి వెంటనే టెస్టులు చేయించుకున్నారు. తనకు కరోనా సోకినా (Yogi Adityanath Tests Positive for COVID-19) ఇంటి నుంచి అన్ని పనులు చేస్తానని, వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా వచ్చినా రెండు సమీక్షలు నిర్వహించానన్నారు.
Here's UP CM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)