You Spit, You Clean: రోడ్డుపై ఉమ్మేసినందుకు శిక్షగా యూనివర్సిటీ రోడ్ క్లీన్ చేయించిన అధికారులు, ఇకపై ఈ విధానాన్ని అమలు చేయాలని పూణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం
అది గమనించిన అధికారి ఆ వ్యక్తితో శుభ్రం చేయించాడు.ఈ నెల 14న ఒక వ్యక్తి పూణే యూనివర్శిటీ రోడ్డుపై వెళ్తూ ఉమ్మాడు. గమనించిన పూణె మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అతడికి శిక్ష విధించారు. ఉమ్మిన చోట ఆ వ్యక్తితోనే శుభ్రం చేయించారు.
మహారాష్ట్రలోని పూణేలో ఒక వ్యక్తి రోడ్డుపై ఉమ్మి వేశాడు. అది గమనించిన అధికారి ఆ వ్యక్తితో శుభ్రం చేయించాడు.ఈ నెల 14న ఒక వ్యక్తి పూణే యూనివర్శిటీ రోడ్డుపై వెళ్తూ ఉమ్మాడు. గమనించిన పూణె మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అతడికి శిక్ష విధించారు. ఉమ్మిన చోట ఆ వ్యక్తితోనే శుభ్రం చేయించారు. ఇకపై ఈ విధానాన్ని అమలు చేయాలని పూణె మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.జనవరి 16, 17 తేదీల్లో జీ 20 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం పూణెలో జరిగింది. ఈ నేపథ్యంలో కఠినమైన క్లీన్‌నెస్ డ్రైవ్‌ను పూణె మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేసింది. రోడ్లు, పుట్‌పాత్‌లు, డివైడర్‌లపై ఉమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)