Heatwaves: దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. రాబోయే అయిదు రోజుల్లో దేశవ్యాప్తంగా తగ్గనున్న ఎండల తీవ్రత.. వడగాలులు వీచే అవకాశాలు తక్కువన్న వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
రానున్న ఐదు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది. దేశంలోని అధికశాతం ప్రాంతాల్లో వడగాలులు (Heatwaves) వీచే అవకాశం లేదని పేర్కొంది.
Newdelhi, April 23: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న భారతీయులకు (Indians) వాతావరణ శాఖ తాజాగా ఓ గుడ్ న్యూస్ (Goodnews) చెప్పింది. రానున్న ఐదు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది. దేశంలోని అధికశాతం ప్రాంతాల్లో వడగాలులు (Heatwaves) వీచే అవకాశం లేదని పేర్కొంది. తమిళనాడు (Tamil Nadu), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా, ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, యూపీ, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా పేర్కొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)