Jakarta, April 23: ఇండోనేషియాను (Indonesia) ఈ తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో (Kepulauan Batu) 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ-EMSC) తెలిపింది. తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండోది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపాల కారణంగా ఎలాంటి నష్టం సంభవించినదీ తెలియరాలేదు. కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Magnitude 6.1 #earthquake jolts Indonesia’s #Kepulauan Batu, 2nd quake strikes hours later https://t.co/VN8iX9kVjG
— IndiaToday (@IndiaToday) April 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)