Cabinet Reshuffle: కొత్త జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేసిన ప్రధాని 

Cabinet Reshuffle

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త టీం వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ సంధర్భంగా వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సహోద్యోగులందరినీ నేను అభినందిస్తున్నాను మరియు వారి మంత్రి పదవీకాలానికి వారికి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మరియు బలమైన మరియు సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తాము. అని ప్రధాని ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now