Narayan Rane, Sarbananda Sonowal, Jyotiraditya

New Delhi, July 7: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు (Modi Cabinet Reshuffle) రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ramnath Kovind) వీరందరితో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

మొదట నారాయణ్ టటు రాణే ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్‌ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ (Modi Cabinet Expansion) ఇదే.

ఆ తర్వాత డాక్టర్ వీరేంద్ర కుమార్, సర్బానంద సోనోవాలా, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్సీపీ సింగ్, అశ్వనీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారస్, కిరణ్ రిజిజు, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, మన్సుఖ్ మాండవ్య, పురుషోత్తం రూపాలా, భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌధరి, అనుప్రియా పటేల్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు మొత్తం 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అందరూ ఇళ్లలో గుట్టి కట్టుకోవాలి, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం, అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరిన మల్కాజ్ గిరి ఎంపీ

బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్, ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ పటేల్ సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జూనియర్ మినిస్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, డాక్టర్ ఎస్‌పీ సింగ్ బఘెల్, రాజీవ్ చంద్రశేఖర్, శోభా కరండ్లాజే, భాను ప్రతాప్ సింగ్ వర్మ, దర్శన జర్దోష్, మీనాక్షి లేఖి, అనుపమ దేవి, ఎ.నారాయణ స్వామి, కౌశల్ కిషోర్, అజయ్ భట్, బీఎల్ వర్మ, అజయ్ కుమార్ ఉన్నారు.

కాగా, కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో నారాయణ్ రాణే, సర్బానంద సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌సీపీ సింగ్ (జేడీయూ), అశ్వని వైష్ణవ్, పశుపతి కుమార్ పరస్ (ఎల్‌జేపీ), కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పురి, మన్షుఖ్ మాండవీయ, భూపిందర్ యాదవ్, పురుషోత్తమ్ రూపాల, జి.కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ ఉన్నారు.

మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 19 మంది మాజీ రాష్ట్ర మంత్రులు, 39 మంది మాజీ ఎమ్మెల్యేలు, రెండు లేదా మూడు సార్లు నెగ్గిన 23 మంది ఎంపీలు ఉన్నారు. ఆసక్తికరంగా నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ప్రమాణస్వీకారం చేసిన 43 మందిలో 13 మంది డాక్టర్లు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు ఉన్నాయి. 11 మంది మహిళలకు చోటు దక్కగా, 14 మంది మంత్రులు 50 ఏళ్లు లోపువారు కావడం విశేషం. దీంతో కేబినెట్‌ సగటు వయస్సు (యావరేజ్ ఏజ్) 58కి తగ్గింది. సామాజికవర్గ కోణంలో చూసినప్పుడు ముస్లిం, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్‌ మతాలకు చెందిన ఒక్కో మంత్రి ఉండగా, 27 మంది ఓబీసీ వర్గానికి, 8 మంది ఎస్టీ వర్గానికి, 12 మంది ఎస్సీ వర్గానికి చెందిన వారున్నారు.

బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. అలాగే మువతరానికి పెద్ద పీఠ వేశారు. బెంగాల్‌లోని కూచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్న నిసిత్ ప్రామాణిక్, అదే రాష్ట్రం నుంచి బొంగావ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న శాంతను ఠాకూర్, పశ్చిమ బెంగాల్‌లోని అలిపుర్దౌర్స్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన జాన్ బర్లా, ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అనుప్రియ సింగ్ పటేల్, మహారాష్ట్రలోని డిండోరి (ఎస్‌టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షునిగా పని చేసిన డాక్టర్ ఎల్ మురుగన్ వంటి యువతరం మోదీ క్యాబినెట్లో కొలువుతీరింది.

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..

1. నారాయణ రాణే : (మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం)

2. సర్బానంద సోనోవాలా : (అసోం నుంచి ముఖ్యమంత్రి, రెండు సార్లు ఎంపీ)

3.డా. వీరేంద్ర కుమార్ : (మధ్యప్రదేశ్‌లోని టిక్‌మార్గ్ నుంచి ఎంపీ)

4. జ్యోతిరాదిత్య సింధియా : (మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం)

5.ఆర్సీపీ సింగ్ : (బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం)

6.అశ్వనీ వైష్ణవ్ : (ఒడిశా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం )

7.పశుపతి కుమార్ పారస్ (బిహార్‌లోని హజీపూర్ నుంచి ఎంపీ)

8.భూపేందర్ సింగ్ యాదవ్ (మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం)

9. పంకజ్ చౌదరి : (యూపీలోని మహారాజ్‌ గంజ్ నుంచి ఎంపీ)

10. మీనాక్షి లేఖి : (ఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు)

11.అనుప్రియ సింగ్ పటేల్ : ( ఉత్తర ప్రదేశ్‌)

12.శోభ కరంద్లాజే : (కర్ణాటక)

13. దర్శన విక్రమ్ జర్దోశ్ : (గుజరాత్‌)

14. అన్నపూర్ణ దేవి : (జార్ఖండ్‌)

15. ప్రతిమ భౌమిక్ : (త్రిపుర (తూర్పు)

16.భారతి ప్రవీణ్ పవార్ : (మహారాష్ట్ర)

17. రాజీవ్ చంద్రశేఖర్ : (కర్నాటక )

18. భానుప్రతాప్ సింగ్ వర్మ (యూపీ)

19. ఏ. నారాయణ స్వామి (కర్నాటక)

20. కౌశల్ కిశోర్ (యూపీ)

21. అజయ్ భట్: (ఉత్తరాఖండ్)

22.బి.ఎల్. వర్మ (యూపీ)

23.అజయ్ కుమార్ (యూపీ)

24. చౌహాన్ దేవుసింగ్ (గుజరాత్‌)

25.భగవంత్ ఖుబా (కర్నాటక )

26. కపిల్ మోరేశ్వర్ పాటిల్ (మహారాష్ట్ర)

27.సుభాశ్ సర్కార్ (బెంగాల్‌)

28. కిషన్ రావ్ కర్నాడ్ (మహారాష్ట్ర)

29. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ (మణిపూర్)

30. విశ్వేశ్వర్ తుడు (ఒడిశాలోని మయూర్‌బంజ్)

31. శంతనూ ఠాకూర్ (బెంగాల్‌లోని బంగోన్ నుంచి ఎంపీ)

32. మంజుపారా మహేంద్ర భాయ్ (గుజరాత్‌లోని సురేంద్ర నగర్ నుంచి ఎంపీ)

33. జాన్ బార్లా : (బెంగాల్ ఎంపీ)

34. డాక్టర్ మురుగన్ (మద్రాస్ హైకోర్టులో లాయర్)

35. నితీశ్ ప్రామాణిక్ (బెంగాల్)