PC Sreeram: తమిళనాడు గవర్నర్‌పై సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీవ్ర విమర్శలు.. బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్

చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉండే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై శ్రీరామ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Credits: Twitter

Chennai, Jan 7: చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉంటూ, దేశీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram) ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు (Tamilnadu) గవర్నర్ ఆర్ఎన్ రవిపై (RN Ravi) శ్రీరామ్ ట్విట్టర్‌లో (Twitter) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆర్ఎన్ రవి రాష్ట్ర గవర్నర్‌లా కాకుండా ఫక్తు రాజకీయనాయుడిలా మాట్లాడుతున్నారంటూ శ్రీరామ్ తీవ్ర విమర్శలు చేశారు.

హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను పాల వాహనంగా మార్చేశాడు.. వీడియో వైరల్

వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న భయం ఆయన యజమానులకు పట్టుకుందని, కాబట్టి ఏదోలా వారికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రస్తుతం వేర్పాటు వాదానికి, ద్వేషభావానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న ఆయన.. గవర్నర్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now