Uttar Pradesh: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ మరో మూడు నెలలు పెంపు, కేబినెట్ సమావేశంలో తొలి నిర్ణయం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిన్న అట్టహాసంగా జరిగింది. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి బాధ్యతలను స్వీకరించారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిన్న అట్టహాసంగా జరిగింది. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈ సమావేశంలో తొలి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ (ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తామని యోగి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. వాస్తవానికి ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని పొడిగిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)