Himanta Biswa Sarma: అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సర్బానంద సోనోవాలే, హిమంతను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ప్రకటించిన కేంద్ర మంత్రి తోమర్
బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా హిమంతను ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు.
ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి బీజేపీ పరిశీలకులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం రేసులో ఉన్న సర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శర్మ పేరును ప్రతిపాదించారు. అంతకుముందే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)