Jharkhand Political Row: విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ సర్కార్, ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు, ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్
సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. విశ్వాసపరీక్షకు నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.
జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. విశ్వాసపరీక్షకు నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం.విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాగా అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)