Kailash Gehlot Joins BJP: వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్‌ గహ్లోత్‌, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే.

Kailash Gehlot Joins BJP (Photo Credits: X/ @ANI)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలు ఇస్తోందని.. పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాశ్‌ గహ్లోత్‌ తాను రాసిన లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో ఏర్పడిన ఆప్‌ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ సొంత రాజకీయ అజెండా కోసం పాకులాడుతున్నదని గెహ్లాట్‌ ఆరోపించారు. అయితే గెహ్లాట్‌ ప్రస్తుతం ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని, ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో అవకాశం లేదని ఆప్‌ నేతలు వ్యాఖ్యానించారు.

అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్

Kailash Gehlot Joins BJP:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now