Karnataka Election Results 2023: ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్, కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం, సీఎం రేసులో పీసీసీ చీఫ్
ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం పదవి రేసులో ఉన్నారు. కాగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్‌కు మంచి పట్టుంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున చల్లకెరె నుంచి రఘుమూర్తి, హిరియూర్ నుంచి సుధాకర్, మొలకల్మూరు నుంచి గోపాలకృష్ణ, కుడ్లిగీ నుంచి శ్రీనివాస్, యంకన్‌మార్డి నుంచి సతీశ్, ధార్వాడ్ నుంచి విజయ్ కులకర్ణి, చిత్రదుర్గ నుంచి వీరేంద్రపప్పి, కల్‌గట్టి నుంచి సంతోష్ ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)