Madhya Pradesh Cabinet Expansion: మధ్యప్రదేశ్‌ రెండో విడత 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం, ఆరుగురు స్వతంత్ర హోదా మంత్రులు

కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Madhya Pradesh Cabinet Expansion (Photo Credit: X/@DrMohanYadav51)

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన క్యాబినెట్‌ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.

సీఎం మోహన్‌ యాదవ్‌ కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకున్న 28 మందితో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగూభాయ్‌ సీ పటేల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేసిన 18 మందిలో ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్‌ సింగ్ పటేల్, కైలాస్‌ విజయవర్గీయ, విశ్వాస్ సారంగ్‌ ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర హోదా మంత్రులుగా అవకాశం కల్పించారు. మరో నలుగురిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif