Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామాలో ట్విస్ట్, ఏక్‌నాథ్‌ షిండేకు షాకిచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌

తాజాగా రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్‌ ఎమ్మెల్యేలపై నితిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు

Nitin Deshmukh

మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్‌ ఎమ్మెల్యేలపై నితిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. కొంతమంది బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి తనకు గుండెపోటు రానప్పటికీ ఇంజెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సూరత్‌ నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. తను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంతకముందు మంగళవారం నితిన్‌ దేశ్‌ముఖ్‌ భార్య.. తన భర్త సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త కు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నితిన్ దేశ్‌ముఖ్ అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)