Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం, కార్యక్రమానికి హాజరైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు.. సోనియా, రాహుల్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సోనియా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు.మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష‍్యమని పార్టీలోని అందరి సహకారం తనకు చాలా అవసరమని ఖర్గే తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఖర్గే చెప్పారు. అలాగే అధికార బీజేపీపై విమర్శలు గిప్పించారు ఖర్గే. కమలం పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)