NOTA Votes in MCD Election: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు షాకిచ్చిన ఓటర్లు, ఎవరూ నచ్చలేదంటూ నోటాకు గుద్దిన అర లక్ష మందికి పైగా ఓటర్లు
ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డులకే పరిమితం చేసింది. ఇదిలా ఉంటే గత ఆదివారం జరిగిన పోలింగ్‌లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి.
ఢిల్లీలో ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డులకే పరిమితం చేసింది. ఇదిలా ఉంటే గత ఆదివారం జరిగిన పోలింగ్‌లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి. అంటే తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. వారిలో 78,93,418 పురుషులు, 66,10,879 మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. ఎంసీడీ ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 (0.78 శాతం) మంది నోటాకు ఓటేశారు.
Here's UPdate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)