CM Zoramthanga: మొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన మిజోరం సీఎం జొరాంతంగ
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Newdelhi, Nov 7: ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎం జొరాంతంగ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఐజ్వాల్ లోని (Aizawl) వైఎంఏ పోలింగ్ కేంద్రానికి (YMA Hall) వచ్చారు. అదే సమయంలో ఈవీఎం మెషిన్ (EVM machine) మొరాయించింది. దీంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రంలోనే వేచిచూసిన ఆయన.. మిషిన్ పనిచేయడం లేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. టిఫిన్ చేసిన తర్వాత ఓటేసేందుకు మళ్లీ వస్తానని చెప్పారు.
Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)