NDA Leaders Meeting: వీడియో ఇదిగో, నరేంద్ర మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీ​యే కూటమి సమావేశం, పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు వార్తలు

సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ హయాంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్‌, శివసేన షిండే వర్గాలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది.

NDA leaders met at Prime Minister Narendra Modi's residence in New Delhi Watch Video

బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీ​యే కూటమి సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ హయాంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్‌, శివసేన షిండే వర్గాలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పాటిల్, ఏక్ నాథ్ షిండే, జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా, జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం

ఈ సమావేశం అనంతరం పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్‌, మంత్రిమండలి సమావేశం. ఈ భేటీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రస్తుత లోక్‌సభ రద్దుకు కేబినెట్‌ సిఫార్సు చేయనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 292 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. బీజేపీ(240), టీడీపీ(16), జేడీయూ(12), ఏక్‌నాథ్‌ షిండే శివసేన(7), ఎల్జేపీ(5), జనసేన(2), ఏజీపీ(1), హిందుస్తానీ ఆవామీ మోర్చా(1), అప్నాదళ్‌(1), ఎన్సీపీ అజిత్‌ పవార్‌(1) ఇతరులు(2) ఉన్నాయి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు